స్వచ్ఛత అందరి బాధ్యత: శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్

TEJA NEWS

స్వచ్ఛత అందరి బాధ్యత: శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్‌పల్లి: స్వచ్ఛత అందరి బాధ్యత అని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ అన్నారు. మండల మహారాజ్ పెట్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పారిశుద్ధ్యం, మొక్కలు నాటుట కార్యక్రమాలను ఉపాధ్యాయులు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను అందజేశారు. పరిసరాల శుభ్రత అందరి బాధ్యతని ఎంపీడీవో చెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, సెక్రెటరీ ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top