క్యాన్సర్ బాధితుడికి బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు శివ ప్రకాష్ ఆర్థిక సహాయం

TEJA NEWS

క్యాన్సర్ బాధితుడికి బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు శివ ప్రకాష్ ఆర్థిక సహాయం

శంకర్‌పల్లి: గత కొన్ని రోజులుగా చైతన్యపురి డివిజన్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ శ్రీధర్ సోదరుడు గోపాల్ ముక్కు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని కాలనీ వెల్ ఫెర్ సభ్యులు రాష్ట్ర యువజన నాయకుడు శివ ప్రకాష్, కాలనీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ లకు తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం శివ ప్రకాష్, అతని మిత్రులు బాధితుడికి రూ.41 వేలు అందజేశారు. అనంతరం శివ ప్రకాష్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితుడి చికిత్స కొరకు మల్లారెడ్డి క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడతానని హామీ ఇచ్చాడు. బాధితుడు శివ ప్రకాష్ కు కృతజ్ఞతలు తెలిపాడు.

You cannot copy content of this page

Scroll to Top