నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన “శాప్” చైర్మన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి జన్మదినోత్సవం సందర్భంగా “శాప్” చైర్మన్ అనిమిని రవినాయుడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు హైదరాబాద్ లోని ట్రస్ట్ భవనంలో భువనేశ్వరి కి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో భువనేశ్వరి నిండు ఆయుష్షు తో, ఆయురారోగ్యాలు కలిగి ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ క్రమశిక్షణ, విలువలు పునికిపుచ్చుకున్న వారసురాలిగా రాజకీయాల్లోను దూసుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. చివరగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
