తిరుమలలోని దుకాణాల్లో సాంప్రదాయ ఆహారం అందించాలి

TEJA NEWS

తిరుమలలోని దుకాణాల్లో సాంప్రదాయ ఆహారం అందించాలి

తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సమావేశ మందిరంలో పలు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు భక్తులకు నాణ్యమైన, రుచికరమైన సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలని అన్నారు.

అదేవిధంగా తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు.

దాతలతో తిరుమలలోని ఉద్యానవనాలను సుందరీకరించాలని సూచించారు.

అనంతరం ఆరోగ్య విభాగం,ఎఫ్ ఎం ఎస్ సేవలు, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్ఈడి బోర్డులు, శ్రీ వారి సేవ, వైద్య, ఐటీ,కళ్యాణ కట్ట విభాగాల పనితీరు, తదితర అంశాలను కూడా సమీక్షించారు.

ఈ సమావేశంలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top