రైల్వే డివిజన్ సాధనకు మీ అందరి సహకారం కావాలి సార్
** రాష్ట్ర మంత్రి అనగానికి “కుప్పాల గిరిధర్” టీమ్ విజ్ఞప్తి
తిరుపతి: తిరుపతి కేంద్రంగా “బాలాజీ రైల్వే డివిజన్” సాధనకు తాము, తమ టీమ్ చేస్తున్న పోరాట యజ్ఞంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతో పాటు అందరు మంత్రుల సంపూర్ణ సహకారాన్ని అర్థిస్తున్నట్లు “రైల్వే డివిజన్ సాధన సమితి” కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ విన్నవించారు. డివిజన్ సాధన కార్యాచరణలో భాగంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి కమ్ రెవిన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కుప్పాల గిరిధర్ కుమార్ నేతృత్వంలోని సభ్యులు కలసి తిరుపతి బాలాజి రైల్వే డివిజన్ విషయంగా వినతిపత్రం ఇచ్చారు.
అందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తిరుపతి అభివృద్ధి విషయంలొ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ విషయo చెప్పినా చాలా సానుకూలంగా స్పందిస్తారని చెప్పారు. ఇప్పుడు రైల్వే డివిజన్ విషయాన్ని కూడా తప్పక సీఎం దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి కూడ తీసుకెళతానని… అదే క్రమంలో మంగళవారం మంత్రి లోకేష్ బాబు కూడా ఢిల్లీ వెళుతున్నారని వారికి కూడ తెలియజేస్తానని చెప్పారు. అలాగే నాయుడు పేట, సూళ్లూరుపేట, తడ, నగరి, పుత్తూరు ప్రాంతాలను కూడ నూతనంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో కలిపినచో మంచి కార్గో టెర్మినల్ లాంటి లోడింగ్ సాకర్యాలు ఏర్పాటు అవుతాయని తెలిపారు.
తద్వారా వ్యాపార అభివృద్ధి చెందునని, పుట్టపర్తి రైల్వే స్టేషన్ బాలాజి డివిజన్లొ కలిపినచో… యాత్రికులకు మంచి సాకర్యములు కలుగునని తెలపగా సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసిన వారిలో తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్ఖులు, రాష్ట్ర యాదవ సంఘ చైర్మన్ నరసింహ యాదవ్, డివిజన్ సాధన సభ్యులు మాధవ నాయుడు, సూరినేని బుజ్జి బాబు నాయుడు, ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి సి.ఆర్.కె శేషగిరి రావు, సి.కృష్ణయ్య, యు.ప్రసాద్ రావు, నీలేష్ కుమార్, అనిల్ కుమార్, టీ.వి.రావు, జంగం తులసిరామ్ రాయల్, తదితరులు పాల్గొన్నారు.
