డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో విత్తనాలు విత్తడం ఎంతో సులువు.. –– జిల్లా కలెక్టర్

TEJA NEWS

డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో విత్తనాలు విత్తడం ఎంతో సులువు.. –– జిల్లా కలెక్టర్

మచిలీపట్నం: డ్రోన్ ల సాంకేతిక పరిజ్ఞానంతో పొలాల్లో విత్తనాలు విత్తడం ఎంతో సులువు, ప్రయోజనకరం అని, ఆ దిశగా రైతులు అవకాశాలను అందిపుచ్చుకొని లబ్ది పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు.

కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ మండల వ్యవసాయ అధికారులు, రైతు సాధికార సంస్థ సిబ్బంది, రైతులకు డ్రోన్ల వినియోగంపై నిర్వహించిన కార్యశాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రుతుపవన వర్షాలకు ముందు (ప్రీ మాన్‌సూన్ డ్రై సీడింగ్ – పీఎండీఎస్) పొడి నేలలో 30 నుంచి 32 రకాల మిశ్రమ విత్తనాలను పొలంలో చల్లేందుకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపకరిస్తుందని, దీనివల్ల సమయం ఆదాతో పాటు కూలీల కొరతను అధిగమించవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటికే గన్నవరం మండలం, వీరప్పనేనిగూడెంలో ప్రయోగాత్మకంగా చేపట్టామని వివరిస్తూ దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పొలంలో మొలిచిన మొక్కలను కొంత కాలాన

You cannot copy content of this page

Scroll to Top