దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి.. ఎమ్మెల్యే అమిలినేని

TEJA NEWS

దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి.. ఎమ్మెల్యే అమిలినేని

బాలవెంకటాపురం గ్రామంలో ప్రజాదర్బార్ లో అనేక సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని

పాఠశాల మూడు చోట్ల కాకుండా ఒకే చోట ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం..

నాలుగు నెలల్లో రెండు రూములు, బోరు, కిచెన్ షెడ్ ఏర్పాటు చేస్తాం

మంత్రి నారా లోకేష్ గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు..ప్రభుత్వ బడుల్లో మీ మిద్యార్థులను చేర్పించండి..

2.40 కోట్లతో గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభం..విద్యుత్ స్థంబాలు కొత్తవి ఏర్పాటు చేశాం

ఆర్డీటీ ఎస్సీ కాలనీలో 10 రోజుల్లో బోరు, మోటారు వేసి నీళ్లు అందిస్తాం.. ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు

శెట్టూరు మండలం మాకోడికి గ్రామంలో పర్యటించి పాఠశాల కోసం స్థలం పరిశీలిస్తాం

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రతిష్టకు 50 వేలు అందించిన ఎమ్మెల్యే

ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తాం

గ్రామంలో వీధి బల్బులు వారంలో పూర్తి చేస్తాం

తిమ్మసముద్రం పేరు రాష్ట్రం మొత్తం వినపడుతోంది

ఇప్పటికే పలు పరిశ్రమలు రాక, MSME పార్కు ద్వారా చిన్న పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు..

తిమ్మసముద్రం ఇండస్ట్రీయల్ పార్కులో మరిన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తాం

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రైతుల సమస్యలపై అధికారులు ద్రుష్టి సారించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచించారు..నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో మారుమూల గ్రామమైన బాలవెంకటాపురం గ్రామంలో డివిజన్, మండల, సచివాలయ సిబ్బందితో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రజాదర్బార్ నిర్వహించారు.. ఉదయం నుంచి పింఛన్ల కోసం, రెవెన్యూ సమస్యలు, ఇళ్ల కోసం, ఇంటి పట్టాల కోసం, రాస్తా సమస్యలు, పాఠశాలలో మౌళిక వసతులు లేవని, అది కూడా మూడు చోట్ల నిర్వహిస్తున్నారని, విద్యుత్ సమస్యలు, గ్రామ స్థాయిలో ఆసుపత్రి భవనం లేదని ఇలా సమస్యలతో వచ్చిన వారి నుంచి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు స్వయంగా స్వీకరించి అక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యేలా చూసి తనకు పరిష్కారం అయింది లేనిది తెలపాలని సూచించారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ నిధులు ఉన్నప్పటికి గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలు సరిగా లేకపోవడం, వీధి లైట్లు వేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే ఊరుకునేది లేదని 10 రోజుల్లోగా బోరు వేయించి మోటారు బిగించి నీళ్లు అందించాలని అలాగే వీధి లైట్లు వారంలోగా వేయించి పూర్తి చేయాలని తెలిపారు..గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రతిష్ట కోసం తన వంతుగా 50 వేల రూపాయలు అందజేశారు. ఇప్పటికే గ్రామంలో 2.40 కోట్లతో సీసీ రహదారులు వేయించామని, శెట్టూరు మండలం మాకోడికి గ్రామంలో పాఠశాల కోసం అక్కడికి వెళ్లి స్థలం పరిశీలించి అవసరమైతే కొంత స్వంత నిధులు కూడా ఇస్తామని తెలిపారు..తిమ్మసముద్రం ఇండస్ట్రీయల్ పార్కులో ఇప్పటికే మంచి పరిశ్రమలు వచ్చాయని త్వరలోనే ఏర్పాటు కాబోతున్నాయని, అందులోనే చిన్న పాటి కూటీర పరిశ్రమల కోసం భూమి కేటాయించామని తిమ్మసముద్రం ఇండస్ట్రీయల్ పార్కులో మెరుగైన మౌళిక వసతులు కల్పించి ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు..గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు..

You cannot copy content of this page

Scroll to Top