మహానాడు కోసం వేద పండితులతో ప్రత్యేక భూమిపూజలు

TEJA NEWS

మహానాడు కోసం వేద పండితులతో ప్రత్యేక భూమిపూజలు

మహానాడుకి 5 నుంచి 7 లక్షల దాకా ప్రజలు

మహానాడు నుచాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం

టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ మే 27, 28, 29వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి సంబంధించిన భూమిపూజ వేద పండితులతో వేడుకగా జరిగింది. కొడవలూరు మండలం లోని కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఉదయం జరిగిన ఈ వేడుకకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నేతలు భారీగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి.. పసుపు పండుగ కోసం అంకురార్పణ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ,నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు బీద రవిచంద్ర,తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శాసనసభ్యులుకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,కురుగుండ రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, పర్యావరణ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వర రావు,నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి, మరియు కార్పొరేషన్ చైర్మన్లు,మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర,జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నరు. అనంతరం వారు మాట్లాడుతూ ఇది చాలా పెద్ద కార్యక్రమం దాదాపుగా 5 నుంచి 7 లక్షల మంది దాకా వస్తారు నెల్లూరు జిల్లాలోనే ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని దీని గురించి అన్ని జిల్లాల వారు ప్రత్యేకంగా చెప్పుకునే విధంగా ఉంటుందని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top