వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు – మూడవ రోజు పూజలు వైభవంగా

TEJA NEWS

వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు – మూడవ రోజు పూజలు వైభవంగా

వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా:
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు.

శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు.
ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top