విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను శ్రీశైలం దేవస్థానం బోర్డు

TEJA NEWS

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ పొతుగుంట రమేష్ నాయుడు దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఆయనకు సాదర స్వాగతం పలికారు.

మర్యాదపూర్వక కలయిక: అమ్మవారి దర్శనం అనంతరం దుర్గ గుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఛాంబర్‌లో రమేష్ నాయుడుని శాలువాతో ఘనంగా సత్కరించారు.
పల్లకి సేవ: అనంతరం ఇరువురు ఛైర్మన్లు కలిసి ఆలయంలో నిర్వహించిన పల్లకి సేవ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top