నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా — కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా — కూన శ్రీశైలం గౌడ్ గారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం పలు ఆహ్వానాలు,వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

— నియోజవర్గంలో నెలకొన్న స్థానిక సమస్యల పట్ల సంబంధిత అధికారులతో మాట్లాడారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ…

— నియోజకవర్గంలో నెలకొన్న స్థానిక సమస్యలను సత్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..

— కాంగ్రెస్ అంటేనే సంక్షేమం,కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి,కాంగ్రెస్ అంటేనే జీవన ఉపాధికల్పన అన్నారు..

— మన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, యువజన నాయకులు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top