లెక్కింపు ప్రక్రియలో పాలు పంచుకునే సిబ్బంది , ఆర్ ఓ లు , ఎ ఆర్ ఓ లకు రామగుండం

WhatsApp Image 2026 02 12 at 6.51.49 PM
TEJA NEWS

లెక్కింపు ప్రక్రియలో పాలు పంచుకునే సిబ్బంది , ఆర్ ఓ లు , ఎ ఆర్ ఓ లకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమం….

పెద్దపల్లి ఫిబ్రవరి 13 న ఓట్ల లెక్కింవు నిర్వహించేందుకు గోదావరి ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ అన్నారు.

ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాలు పంచుకునే సిబ్బంది , ఆర్ ఓ లు , ఎ ఆర్ ఓ లకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు . ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ.. లెక్కింపు ప్రక్రియలో పాలుపంచుకునే సిబ్బంది ఉదయం 6.00 గంటలకే కౌంటింగ్ సెంటర్ లో రిపోర్ట్ చేయాలని అన్నారు. ఉదయం 8.00 కు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఆ తరువాత అన్ని డివిజన్లకు సంబందించి ఏక కాలంలో బ్యాలెట్ బాక్సులలో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు.

వెయ్యి ఓట్లకు ఒక రౌండ్ చొప్పున దాదాపు మూడు రౌండ్ లలో లెక్కింపు పూర్తవుతుందని అన్నారు.కౌంటింగ్ సూపర్ వైజర్ గా , కౌంటింగ్ అసిస్టెంట్లుగా 180 మందిని ప్రత్యేకంగా నియమించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో శిక్షకులు కె. శ్రీనివాస్ , జె. శ్రీనివాస్ తో పాటు నగర పాలక సంస్థ ఎ సి పి శ్రీ హరి , టి పి ఎస్ నవీన్ , డి.ఇ.శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page