గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు కట్టుదిట్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి…..

TEJA NEWS

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు కట్టుదిట్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి…..

-జిల్లా కలెక్టర్ కోయ హర్ష…

పెద్దపల్లి,
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు కట్టుదిట్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్ల పై ఇ.వై టీం నిశాంత్, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, 2027 జూన్ 26 నుంచి, 2027 జూలై 7 వరకు గోదావరి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు జరుగుతాయని, దీనికి సంబంధించి మన జిల్లాలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అవసరమైన ఘాట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైటింగ్, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధి కు ప్రతిపాదనలు తయారు చేసి వీలైనంత త్వరగా సమర్పించాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డీసీపీ రాంరెడ్డి ,ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ,డి. పి.ఓ. వీర బుచయ్య, గోదావరిఖని ఏ.సి.పి.రమేష్, ఈఈ ఆర్ అండ్ బి భావ్ సింగ్, ఈఈ మిషన్ భగీరథ ఇంట్రా శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

You cannot copy content of this page

Scroll to Top