విద్యార్థుల భవిష్యత్ కు బలమైన పునాదులు

TEJA NEWS

విద్యార్థుల భవిష్యత్ కు బలమైన పునాదులు వేసేలా విద్యారంగాన్ని లోకేశ్ తీర్చిదిద్దారు : ప్రత్తిపాటి

  • బాలబాలికలు తమ విద్యాభ్యాసం ముగించే సమయానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎదురు చూసేలా ప్రభుత్వం పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తోంది
  • చిన్నారుల మనస్సు తెల్లకాగితం లాంటిది..
  • జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమంలో మాజీమంత్రి ప్రత్తిపాటి

జాతీయ బాలల దినోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉందని, చిన్నారుల మనస్సు తెల్ల కాగితం లాంటిదని, కల్మషం లేని వారి మనసుల్లానే సమాజం, రాష్ట్రం కూడా ఎల్లప్పుడూ ఐక్యంగా ముందుకు సాగాలని మాజీమంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రత్తిపాటి, ముందుకు మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఇటీవల నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల చదువుతో పాటు వారిలోని ప్రతిభ, నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు స్థానిక ఎన్ఆర్ఐ లు పాఠశాలలో ఏర్పాటు చేయించిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

నెహ్రూ మాదిరిగానే లోకేశ్ కు చిన్నారులు.. వారి ఆటపాటలంటే ఎంతో మక్కువ..
రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టాక విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలవుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బంగారు భవిష్యత్ కు బలమైన పునాదులు వేసేలా లోకేశ్ కృషిచేస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. నెహ్రూ మాదిరిగానే లోకేశ్ కు పిల్లలన్నా, వారి ఆటపాటలు, విద్యాబుద్ధులన్నా ఎంతో మక్కువ, ఎనలేని ప్రేమని ప్రత్తిపాటి తెలిపారు. కేవలం సంవత్సరం న్నరలోనే రాష్ట్రంలో నూతన విద్యావ్యవస్థకు అంకురార్పణ చేసిన ఘనత లోకేశ్ కే దక్కుతుందన్నారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకునే సమయానికి వారికి అవసరమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాష్ట్రంలోనే లభించేలా ప్రభుత్వం, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఎన్ఆర్ఐలు గోరంట్ల వాసుబాబు, బొప్పన సుబ్బారావు సైన్స్ పాఠ్యాంశాలకు సంబంధించిన వివిధ చిత్రాలను పాఠశాలకు అందించడం వారి సామాజిక స్ఫూర్తికి నిదర్శనమని ప్రత్తిపాటి కొనియాడారు.

కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు పిల్లి లెనిన్, గెరా రాము, మున్సిపల్ కౌన్సిలర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రత్న జ్యోతి, కమిటీ చైర్మన్ పిల్లి ధనలక్ష్మి, టీడీపీ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top