గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

TEJA NEWS

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య?

మహబూబ్ నగర్:
మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఉదయం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది, ఉదయం 6:30 గంటల సమయంలో తరగతి గదిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

గమనించిన తోటి విద్యా ర్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్కూల్‌కు వచ్చిన టీచర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధిం చిన వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top