మున్సిపల్ కార్మికుల పై సూపర్వేజరుల పెత్తనం అరికట్టాలి

TEJA NEWS

మున్సిపల్ కార్మికుల పై సూపర్వేజరుల పెత్తనం అరికట్టాలి
-ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్

కుత్బుల్లాపూర్ :

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేసే సిబ్బందిని, కార్మికులను కొంత మంది సూపర్వేజర్లు ఇబ్బందులకు గురించేస్తున్నార‌న్న‌ విషయం తమ దృష్టికి రావ‌డంతో…ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షబ్బీర్ అలీ, శానిటైజర్ ఇంచార్జ్ జయ్ రాజ్ కి పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల‌ శ్రీనివాస్ మాట్లాడుతూ… గతంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు గ్రామాలుగా ఉండేదని… అప్పుడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కార్మికులు పని చేసే వారని… వారికి ఆ గ్రామపంచాయితీ జీతాలు ఇచ్చేదని గుర్తు చేశారు. అప్పుడు కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చిన కార్మిక సంఘం పేర్లు ఏదైనా బాచుపల్లి, ప్రగతినగర్లో చల్ల.సుధీర్ రెడ్డి, నిజాంపేట్ ఆశి. యాదయ్య, నాయకత్వం వహించేదన్నారు.

వారి నాయకత్వంలో కార్మికులు సిబ్బంది పని చేసే వారన్నారు. ఇప్పుడు ఉమ్మడి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు అయినా తరువాత… కొంత మంది స్వార్థ రాజకీయాల కోసం అనేక విధాలుగా కార్మికులకు, సూపర్వేజర్లు, వార్డు ఆఫీర్సలు ఇబ్బంది చేస్తున్నార‌ని అన్నారు. నేటికీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అందరిని కలుపుకొని అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామ‌న్నారు. కార్మికుల‌ను ఇబ్బంది పెట్టే సూప‌ర్వైజ‌ర్ల‌ను బ‌దిలీ చెయ్యాల‌ని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మున్సిపల్ అధ్యక్షులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top