మామిడి రైతులకు అండగా నిలవండి

TEJA NEWS

మామిడి రైతులకు అండగా నిలవండి… అధికారులకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచన

తిరుపతి: మామిడి సీజన్ నేపథ్యంలో మామిడి రైతులకు అధికారులు అండగా నిలవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తోతాపురి మామిడిని పరిశ్రమలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకోవాలని ఆదేశించారు. ధరల పతనంతో మామిడి రైతులు దిగాలు పడకుండా ఉండేలా మనమంతా స్పందించి మేలు చేద్దామని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మామిడి రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పిన ఎంపీ చిత్తూరు పార్లమెంటులో మామిడి బోర్డ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మామిడి రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రవిస్తుండడం అభినందనీయమన్నారు.


మామిడి సీజన్లో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అంశం పై ఇప్పటికే పలుమార్లు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఆ దిశగా.., దిశా నిర్దేశం కూడా చేసినట్లు ఆయన వివరించారు. అయితే సమీక్షా సమావేశాల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి.., వాటిని తూచా తప్పకుండా అధికారులు అమలుపరచడం ద్వారా మామిడి రైతులకు మేలు చేసిన వారమవుతామని అభిప్రాయపడ్డారు. అలా కాదని, అలసత్వం వహిస్తే సమస్య ఉత్తన్నమవు తుందనే విషయాన్ని జిల్లా యంత్రాంగం గ్రహించాలన్నారు. మామిడి రైతుల విషయంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి, వారికి న్యాయం చేయాలని తెలియజేశారు. అప్పుడే ప్రభుత్వ ఆశయం కూడా నెరవేరుతుందని , మామిడి రైతుల కష్టానికి ఫలితం దొరుకుతుందన్నారు.

You cannot copy content of this page

Scroll to Top