ప్రియాంక కదలికలపై నిఘా!
- అమరావతి: పిల్లల విక్రయాల కేసులో కీలక నిందితురాలు ప్రియాంక కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవల దిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం నుంచి ఆమె త్రుటిలో తప్పించుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి గురితప్పకుండా ఉండేందుకు అక్కడి పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. త్వరలో పోలీసుల ఎదుట నిందితురాలు లొంగిపోనున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం ఇచ్చింది
