స్వామి వివేకానంద నూతన విగ్రహాన్ని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

TEJA NEWS

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కెపిహెచ్బి రోడ్ నెంబర్-1 లో చత్రపతి ధర్మరక్షణ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద నూతన విగ్రహాన్ని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.

స్వామి వివేకానంద 123’వ వర్ధంతి సందర్భంగా చత్రపతి ధర్మరక్షణ సేన అధ్యక్షులు వేణుగోపాల్ మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు & మాధవరం కాంతారావు ముఖ్య అతిధులుగా పాల్గొని, ఈటల రాజేందర్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ –
“స్వామి వివేకానంద యువతకు శాశ్వత ప్రేరణాస్రోతం. వారి సందేశాలు సమాజాన్ని మార్చగల సామర్థ్యం కలిగినవి. యువత స్వామిజీ బాటలో నడిచి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, చత్రపతి ధర్మరక్షణ సేన సభ్యులు, స్థానిక ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top