పిల్లిగుండ్ల గ్రామ సర్పంచ్ గా 82 ఓట్ల మెజార్టీతో గెలిచిన జంగంపేట స్వాతి కాంత్ రెడ్డి
శంకర్‌పల్లి మండలంలోని పిల్లిగుండ్ల గ్రామ సర్పంచ్ గా జంగంపేట స్వాతి కాంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. సర్పంచ్ ఎన్నికలలో ప్రత్యర్థి అభ్యర్థిపై 82 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా స్వాతి కాంత్ రెడ్డి మాట్లాడుతూ తనను సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం అందరితో కలిసి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామంలోని ప్రతి ఇంటికి వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని తెలియజేశారు.
