చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోండి

TEJA NEWS

చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోండి

** జిల్లా కలెక్టర్ కు సీపీఎం నాయకుల వినతి

తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గం, తిరుచానూరు పంచాయితీలోని యోగిమల్లవరం గ్రామంకు చెందిన ప్రభుత్వ చెరువు భూమి (సర్వే నెం. 1/1
1/2) అక్రమంగా ఆక్రమించుకున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్.జయచంద్ర, రూరల్ కార్యదర్శి కే.సుమన్ నేతృత్వంలోని ప్రతినిధులు
కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో ఇచ్చిన అంశాలను వెల్లడించారు. “తిరుచానూరు యోగిమల్లవరం గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్న చెరువును ఇప్పటికే కొంతమంది భూ కబ్జాదారులు యదేచ్చగా ఆక్రమించుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు.

చెరువు ఉండడం వల్ల ఆ ప్రాంతం లో
నీటి సరఫరా వ్యవస్థ, పర్యావరణం ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయి” అని వివరించారు.
అయినా ఆ ప్రాంతపు చెరువును పూర్తిగా ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు. దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసే భూమి కబ్జాకు గురవుతుంటే రెవెన్యూ అధికారులు పట్టిపట్టనట్లుగా వివరిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు కొన్ని ఇళ్లను నిర్మాణం చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. కాబట్టి చెరువు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top