పేటలో బాణసంచా షాపుల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి

TEJA NEWS

పేటలో బాణసంచా షాపుల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి!

అమ్మే ధరలపై అధికారులు చర్యలు తీసుకోండి

నిబంధనల ప్రకారం షాపులు ఉన్నాయా!?

అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్..

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్ కోరారు. ప్రభుత్వం కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంపై కమిటీని వేయడమే కాకుండా నివేదిక ఆధారంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భాను ప్రసాద్ కోరారు. చిలకలూరిపేట పట్టణంలో నేషనల్ హైవే పై ఏర్పాటుచేసిన బాణసంచా విక్రయ కేంద్రాలలో భద్రతా నిబంధనలు అమలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు.
చిలకలూరిపేట పట్టణం బాణసంచా విక్రయాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి.. ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయనేది జగమెరిగిన సత్యం, బాణసంచా విక్రయదారులు తీసుకునే లైసెన్సులు, అమ్మే సరుకుకు వాటి రేట్లకు ఏమాత్రం పొంతన ఉండటం లేదని సంబంధిత అధికారులు స్పందించి రేట్ల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top