తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ (టీజేఎఫ్) 25 వసంతాల రజతోత్సవ సంబురాల గోడ పత్రిక

TEJA NEWS

తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ (టీజేఎఫ్) 25 వసంతాల రజతోత్సవ సంబురాల గోడ పత్రిక ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద …

కుత్బుల్లాపూర్ లోని మున్సిపల్ కార్యాలయం సర్కిల్ వద్ద ఈనెల 31వ తేదీన నగరంలోని నెక్లెస్ రోడ్డు లో నిర్వహించనున్న టీజేఎఫ్ 25 వసంతాల సంబురాలను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడి ప్రజలను చైతన్య పరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల రజతోత్సవ సంబురాలను నిర్వహించుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (హెచ్ – 143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధీర్ మహంకాళి, పలువురు విలేకరులు , జగన్, విజయ్ శేఖర్ గౌడ్, రషీదా మహమ్మద్ రఫీ, మంత్రి సత్య నారాయణ, సురేష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top