ధాన్యం కొనుగోలు వివరాలను సకాలంలో ట్యాబ్ లో నమోదు చేయాలని: కలెక్టర్

TEJA NEWS

ధాన్యం కొనుగోలు వివరాలను సకాలంలో ట్యాబ్ లో నమోదు చేయాలని: కలెక్టర్

సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించే ఐ కే పి,పి ఏ సి ఎస్, మెప్మా, ఎఫ్ పి ఓ లకు చెందిన అధికారులు, సిబ్బంది తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించిన వెంటనే బిల్లులను పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయం లో సమర్పిస్తే వేగవంతంగా రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారూ. ఈ సమావేశమునకు జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు, డి ఎస్ ఓ మోహన్ బాబు, డి ఎం రాము, డి సి ఓ ప్రవీణ్ కుమార్,వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

You cannot copy content of this page

Scroll to Top