గణేష్ మండప కూల్చివేతను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తా : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
127 – రంగారెడ్డి నగర్ డివిజన్ ఐడిపిఎల్ గూడెన్ మెట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో గల గణేష్ మండపాన్ని గత శనివారం మధ్యాహ్నం తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అధికారులు కూల్చి వేశారు. ఈ విషయాన్ని మండప నిర్వాహకులు, బస్తీ వాసులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గూడెన్ మెట్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గణేష్ మండప కూల్చివేత విషయాన్ని హౌసింగ్ బోర్డ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ శేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, నాయకులు, క్రాంతి యాదవ్, జల్దా లక్ష్మీనాథ్, సతీష్ గట్టోజీ, కార్తీక్ గౌడ్, రమ్మీ గౌడ్, అల్లావుద్దీన్, కాలనీ వరకు ఎస్ . శ్రీనివాసులు, అశోక్, ప్రభు, శ్రీకృష్ణ, జి .యాదగిరి, సాయి, నాగరాజు, ప్రవీణ్, టీ.రాజు తదితరులు పాల్గొన్నారు.
