సి.ఎం.ఆర్.ఎఫ్. పథకం ద్వారా ఆనారోగ్యంతో బాధ పడుతున్న వారికి వైద్య చికిత్సలో ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుందని – ఎమ్మెల్యే కె. పి.వివేకానంద..
సి.ఎం.ఆర్.ఎఫ్. పథకం ద్వారా మంజూరైన ఎల్.ఓ.సి. చెక్కుల పంపిణీ కార్యక్రమం చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుల సమక్షంలో ముగ్గురు లబ్దిదారులకు CMRF నిధుల ద్వారా మంజూరైన రూ.3,50,000/- విలువగల ఎల్.ఓ.సి. చెక్కులను లబ్దిదారుల కుటుంబసభ్యులకు పంపిణీ చేయడం జరిగింది.
లబ్దిదారులు వివరాలు:
- శ్రీమతి అమ్తుల్లా తస్లీం , రోడ్డమిస్ట్రీ నగర్ నివాసి – రూ. 2,00,000/- విలువ గల చెక్కు.
- శ్రీమతి బేసన్ గౌరి బాయి , గాంధీ నగర్ నివాసి – రూ. 75,000/- విలువ గల చెక్కు.
- శ్రీ గుడ్దితి రామాంజనేయులు , ద్వారకా నగర్, చింటల్ నివాసి – రూ. 75,000/- విలువ గల చెక్కు.
ప్రభుత్వ సహాయం అవసరమైన వారికి సకాలంలో అందేలా చూసే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ నిధుల ద్వారా లబ్దిదారులకు వైద్య చికిత్సలో ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో 131 డివిజన్ మాజీ కార్పొరేటర్ కె.ఎం గౌరీష్, 125 డివిజన్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామి రెడ్డి, ఉద్యమకారుడు కస్తూరి బాలరాజు, సురేందర్ రెడ్డి, కళ్ళెం శ్రీనివాస్ గౌడ్, రంజాన్ పాల్గొన్నారు..
