సూళ్లూరుపేట వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ మొట్టమొదటి సమావేశం తడ
ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ
తిరుపతి జిల్లా తడ మండలం పులివెంద్ర గ్రామంలోని సూళ్లూరుపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోటి రమేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని నూతన కమిటీ డైరెక్టర్లకు, కార్యాలయ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయ మార్కెట్ చుట్ట ప్రక్కల గ్రామాలలోని రైతులకు మార్కెట్ కమిటీ యార్డు ద్వారా అన్ని సహాయ సహకారాలు అందించాలని, అలాగే అభివృద్ధి కూడ జరగాలని తెలిపారు.
మన ప్రభుత్వం రైతులకు అందించాల్సిన సబ్సిడీ విత్తనాలు,ఎరువులు సకాలంలో అందిస్తుందని దేశానికి రైతే వెన్నుముక అని ఎమ్మెల్యే తెలిపారు. పై కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఓడూరు రవీంద్రారెడ్డి, డైరెక్టర్ తప్పని బాబు సర్పంచ్ లక్ష్మి, తెదేపా తడ ప్రెసిడెంట్ పళని, సుధాకర్ రెడ్డి, కమిటీ మెంబర్లు, కొండూరు తెదేపా నాయకులు సుధాకర్ రెడ్డి అధికానెలవలరులు, రైతులు పాల్గొన్నారు.
