కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నూతన కమిటీల ఏర్పాటు

TEJA NEWS

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా అభిప్రాయ సేకరణ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి కెవిఆర్ కన్వెన్షన్ లో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదన జాబితాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ సమావేశంలో అబ్సర్వర్స్ శ్రీమతి పారిజాత నర్సింహ రెడ్డి, దుర్గం భాస్కర్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ కార్యదర్శి భూపతి రెడ్డి,గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో రాష్ట్రంలో నూతన కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు..

కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తలను గుండెలో పెట్టుకునే పార్టీ కాబట్టి కార్యకర్తలు, నాయకులు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని కోరారు..

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రపంచానికె ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు..

పార్టీ పదవులు అందిన, అందకపోయినా పార్టీ నాయకులు కార్యకర్తలు అధైర్య పడవద్దు ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉండి గుర్తింపుని ఇస్తుందన్నారు..

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మహిళ నాయకులు,బ్లాక్ నాయకులు, డివిజన్ నాయకులు, మున్సిపల్ పరిధి నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top