ప్రభుత్వ పాఠశాలలలోనే విద్యార్థులకు ఉజ్వల భవిషత్ *
ప్యానెల్ డిజిటల్ క్లాసులు, మౌలిక సదుపాయాలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన,……… ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్
వనపర్తి : బడిబాట కార్యక్రమంలో భాగంగా యాపర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ ఉపాధ్యాయులతో కలిసి మియాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. బడి ఈడు గల పిల్లలందరూ తప్పనిసరిగా ప్రభుత్వ బడిలోనే చదవాలని ప్రభుత్వ బడులలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పిల్లలు తల్లిదండ్రులకు తెలియజేస్తూ .ఉచిత విద్య, నాణ్యమైన విద్య, ఉచిత దుస్తులు రెండు జతలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు, వారంలో మూడుసార్లు గుడ్డుతో సన్న బియ్యంతో ఉచిత మధ్యాహ్నం భోజన పథకం, ప్యానెల్ డిజిటల్ క్లాసులు, ఉన్నత విద్యార్హతలు మరియు అనుభవం గల ఉపాధ్యాయులచే బోధన, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతినెల సమీక్ష సమావేశాలు, విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ గ్రంథాలయ సౌకర్యం , మొదలగు మౌలిక వసతులను కల్పించడం జరుగుతున్నందున ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని తెలియజేయడం జరిగింది.అన్నీ వసతులతో అందుబట్లో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాల ఎందుకు అన్నారూ.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొహినోద్దీన్, వెంకటేశ్వర్లు, బాలమ్మ, ఈశ్వర్ రెడ్డి, ఇందిరమ్మ, రమేష్, ఆంజనేయులు , పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు స్వరాజ్యం బాబురెడ్డి , శివాని మరియు గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు
