ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా

TEJA NEWS

ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా

దత్తాత్రయ కాలనీ ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తాత్రయ కాలనీ లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కాలనీలో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులకు సంబంధించిన వినతి పత్రాలను కాలనీ వాసులు కార్పొరేటర్ కి అందించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దత్తాత్రయ కాలనీలో దాదాపు తొంబై శాతం అభివృద్ధి పనులు పూర్టైనట్లు కాలనీ వాసులే చెప్పడం సంతోషంచదగ్గ విషయం అని అన్నారు. డివిజన్ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, కాలనీలో పెండింగ్లో ఉండి అసంపూర్తిగా మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు తన దృష్టికి తీసుకువచ్చిన రోడ్లు, డ్రైనేజీ, త్రాగు నీరు, వీధి దీపాలు, పారిశుద్యం వంటి పెండింగ్ ఉన్న సమస్యలను శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని అన్నారు.

అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ గారు తెలియచేసారు. కాలనీలోని ఒక గల్లీలో మంజీరా నీటీలో డ్రైనేజీ నీరు కలిసి త్రాగునీరు కలుషితం అవ్వుతుందని కాలనీ మహిళలు సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకురగా కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి సమస్యను త్వరలో పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు అందించాలని అన్నారు.

కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, భాస్కర్ రెడ్డి, గోపాల్, జగదీష్, సత్యనారాయణ, వెంకటేష్ గౌడ్, వీరేషం, అశోక్, నాగభూషణం, కృపాకర్ గౌడ్, లింగం, సత్తయ్య, ఎమ్.డి మోసిన్, హరి, శ్రీకాంత్, లక్ష్మణ్ రావు, రామకృష్ణ, యాదగిరి.

జి.ఎచ్.ఎమ్.సి అధికారులు వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ, ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top