ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం..

TEJA NEWS

ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం…

అవసరమున్న ప్రతి డివిజన్ లలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు…

నాణ్యత ప్రమాణాలు పాటించక పోతే చర్యలు తప్పవు..

అభివృద్ధి పనులను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలి…

నేడు 65వ డివిజన్ దేవన్నపేట లో రూ 60 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు, మేయర్ సుధారాణి…

హన్మకొండ జిల్లా/ 65వ డివిజన్/ దేవన్నపేట…

అవసరమున్న ప్రతి డివిజన్ లలో పార్టీలకు అతీతంగా చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నేడు 65వ డివిజన్ పరిధిలోని దేవన్నపేట గ్రామంలో సూమరు రూ.60 లక్షల సీసీ రోడ్డు & డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు గారు, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ..

అనంతరం గ్రామంలో సబ్ సెంటర్ కోసం ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ఎమ్మెల్యే నాగరాజు కి వినతిపత్రం అందజేయగా వెంటనే సంబంధించి త్వరలోనే ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-…

ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, అవసరమున్న ప్రతి డివిజన్‌లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేపట్టిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలోనే పర్యవేక్షిస్తూ, ప్రజలకు పూర్తి స్థాయిలో లాభం చేకూరేలా చూడాలని ఆదేశించారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, గ్రామాలు–డివిజన్ల రూపురేఖలు మారేలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుగులోతు దివ్య, డివిజన్ అధ్యక్షుడు అయ్యాల రాజిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, ఆత్మకూరు AMC వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పోలేపాక అశోక్, మాట్ల విష్ణు, సునీల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల పవన్, బత్తుల స్వాతి తో పాటు డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top