పేదలకు ఇళ్ళు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది..

TEJA NEWS

పేదలకు ఇళ్ళు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది..

అర్హులైన పేదలకు ఇళ్ళు కేటాయిస్తాం..

జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ.

నిరుపేదలకు ఇళ్ళు కేటాయించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళు కేటాయించి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ తెలిపారు.

నగరంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 46వ డివిజన్కు లంబాడి పేట చెందిన నివాసితులు కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశను కలసి కొండప్రాంత మహిళలు జాబితా తయారు చేసి వారంతా స్వచందంగా తమ ఇళ్ళను ఖాళీ చేయడానికి ముందుకు పచ్చామని నిరుపేదలైన తమకు ఇళ్ళు కేటాయించాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అర్హులైన నిరుపేదలకు పక్కాగృహలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుల సూచనలు పరిగణంలోకి తీసుకుని కొండ ప్రాంత వాసుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. కొండ ప్రాంత వాసులందరూ ఒక్కమాటపై నిలబడితే మీ అందరి కష్టాలు తీరుతాయని తాను అండగా ఉంటానని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మీ వంతుగా కొంత నగదును చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. తర్వలో ఇది కార్యరూపం దాల్చి గృహాలు మంజూరు అయితే ఎప్పటి నుండో అనేక ఇబ్బందులు గురి అవుతున్న కొండప్రాంత వాసుల కష్టలు తీరుతాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.

కలెక్టర్ను కలసిన కొండప్రాంత వాసుల వెంట ప్రతిపాటి శ్రీధర్ స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
…………………………..
డిఐపిఆర్వో ఎన్టీఆర్ జిల్లా విజయవాద వారిచే జారీ…

You cannot copy content of this page

Scroll to Top