గత ప్రభుత్వం గంజాయి.. డ్రగ్స్ తో యువత జీవితాలు నాశనం చేసింది : ప్రత్తిపాటి
- కూటమిప్రభుత్వం గంజాయి… మాదకద్రవ్యాలకు రాష్ట్రంలో స్థానం లేకుండా చేసింది : ప్రత్తిపాటి.
- మెగాడీఎస్సీ అమలు.. పరిశ్రమల ఏర్పాటుతో చంద్రబాబు యువత భవితకు ప్రాధాన్యం ఇస్తున్నారు : ప్రత్తిపాటి.
గత ప్రభుత్వం గంజాయి…డ్రగ్స్ కు యువతను బానిసల్ని చేసి వారి జీవితాలు నాశనం చేసిందని, కూటమిప్రభుత్వం గంజాయి కట్డడితో పాటు ఇతర మాదకద్రవ్యాలకు రాష్ట్రంలో స్థానం లేకుండా చేసిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్ విభాగం పట్టణంలో చేపట్టిన ర్యాలీలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్.ఆర్.టీ సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీలో సిఐ రమేష్ పోలీస్ సిబ్బందితో పాటు యువత, మహిళలు పాల్గొని.. గంజాయి, మాదకద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ ముగిసిన అనంతరం యువత, మహిళలను ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు.
గంజాయి.. ఇతర మాదకద్రవ్యాల సంస్కృతిని గతప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టి… అమాయకులైన యువత జీవితాలు నాశనం చేసిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి అనేక చర్యలు తీసుకున్నారని ప్రత్తిపాటి చెప్పారు. ఈగల్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు.. ప్రత్యేక బృందాలతో గంజాయి సాగు.. రవాణా..విక్రయాలకు అడ్డుకట్ట వేశారని, ఎక్కడా డ్రగ్స్ కనిపించకుండా చేశారని ప్రత్తిపాటి తెలిపారు. యువత భవిష్యత్ కు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే మెగా డీఎస్సీని అమలుచేసిన ప్రభుత్వం… పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, .ఉపాధి కల్పనకు కృషిచేస్తోందన్నారు. మాదకద్రవ్యాల వాడకం… విక్రయాలవల్ల జరిగే అనర్థాలు యువతకు తెలియచేయడానికే నేడు పోలీస్ శాఖ ర్యాలీ చేపట్టిందని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజలు.. ముఖ్యంగా యువత గంజాయి ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంచుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో పట్టణ పోలీస్లు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, గోల్డ్ శ్రీను, జాలాది సుబ్బారావు, బేరింగ్ మౌలాలి, కౌన్సిలర్ లు , టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
