శాంతి నగర్ కాలనీల మధ్య గల STP లైన్ లో తలెత్తిన సమస్య

TEJA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ మరియు శాంతి నగర్ కాలనీల మధ్య గల STP లైన్ లో తలెత్తిన సమస్య పరిష్కారానికై చేపడుతున్న మరమ్మత్తు పునరుద్ధరణ పనులను జలమండలి అధికారుల తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ మరియు శాంతి నగర్ కాలనీల మధ్య గల STP లైన్ లో తలెత్తిన సమస్య ను సూపర్ సక్కర్ యంత్రం ద్వారా పనులు చేపడుతున్నాం అని, STP లైన్ లో పేరుకుపోయిన చెత్త చెదారం ను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. STP లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని, ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన,కుంచించుకోపోవడం వలన కాలనీ లో మురుగు సమస్య తీవ్రమైనది అని, STP ఔట్ లెట్ ను సరి చేసి డ్రైనేజి సమస్య ను త్వరితగతిన పరిష్కరించాలని, కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని , దీనికి శాశ్వత పరిష్కారంగా STP లైన్ పునరుద్ధరించి, త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడలని, డ్రైనేజి మ్యాన్ హోల్ ల ను మరమ్మత్తులను చేపట్టి ఇబ్బంది లేకుండా చూడలని, మళ్లి పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,సూపర్ సక్కర్ మిషన్ ద్వారా ప్రతి మ్యాన్ హోల్ లో చెత్త చెదారం లేకుండా పూడిక తీసి, నీటి ప్రవాహం సాఫీగా సాగేల చూడలని , అవసరమున్న చోట మ్యాన్ హొల్స్ ను మరమ్మత్తులు చెపట్టి అందుబాటులో కి తీసుకోవాలని జలమండలి అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

కాలనీ వాసులకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని,ఏ చిన్న సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానాని, ప్రతి కాలనీ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి అగ్రగామి నియోజకవర్గం గా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ శిరీష, వర్క్ ఇన్స్పెక్టర్ కిష్టప్ప మరియు నాయకులు నాగరాజు,ఓ. వెంకటేష్, అక్బర్ ఖాన్,ఎల్లమయ్య,నరేందర్ బల్లా, యూసఫ్, సందీప్ రెడ్డి,అవినాష్ రెడ్డి, రాజు,యశ్వంత్, రాహుల్ కాలనీ వాసులు మరియు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top