చేనేతల సమస్యలు పరిష్కరించాలి

TEJA NEWS

చేనేతల సమస్యలు పరిష్కరించాలి

** చిత్తూరు ఎంపీని కలిసిన చేనేత సంఘం నాయకులు

చిత్తూరు / తిరుపతి: చేనేత గర్జన ప్రచార కార్యక్రమాలలో భాగంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావును చిత్తూరులోని ఎంపీ కార్యాలయంలో చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల వాసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ కార్యవర్గ సభ్యులు, పెనుమూరు మాజీ ఎంపీపీ జి.షణ్ముఖ, చిత్తూరు మున్సిపాలిటీ చేనేత అధ్యక్షులు టి.హరి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 16 చేనేత కార్మిక సంఘాలు, 21 డిమాండ్లతో కూడిన అంశాలతో చేనేత గర్జన కార్యక్రమం మంగళగిరిలో నిర్వహిస్తున్న విషయాన్ని, గోడపత్రిక ఇచ్చి వివరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగ అభివృద్ధికి, చేనేత రక్షణకు, సంక్షేమానికి చేపట్టాల్సిన క్రింది అంశాలతో కూడిన ప్రధాన డిమాండ్లను ఎంపీ ప్రసాద రావుకు వివరించారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రూ.50 లక్షల 65 వేల కోట్లలో చేనేత రంగానికి 25 వేల కోట్లు కేటాయించాలి. అలాగే
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రూ.3 లక్షల 22 వేల కోట్లలో చేనేత రంగానికి కనీసం రూ రెండు వేల కోట్లు కేటాయించాలి. సకాలంలో నిధులు విడుదల చేయాలి. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. రాష్ట్ర అధినాయకత్వం వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం రూ.25వేల ఆర్థిక సహకారం నేతన్నలందరికీ, చేనేత ఉపవృత్తులు చేసుకునే కార్మికులకు కూడా, ఇంకెంత మాత్రం జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలి.


చేనేతన్నలందరికీ 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పథకాన్ని వెంటనే అమలు పరచాలి. సహకార సంఘాలకు వున్న రుణాలను రద్దు చేయాలి.
చేనేత సహకార సంఘాలు డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంకుల నుండి తీసుకున్న ఆర్థిక రుణాలపైన కట్టవలసిన వడ్డీలో రాయితీగా రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలి. త్రిఫ్ట్ ఫండ్ చెల్లించాలి. చేనేత వస్త్రోత్పత్తికి వినియోగించే ప్రధాన ముడి సరుకు చిలప నూలుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ చట్టం హ్యాంక్యార్న్ ప్యాకింగ్ నోటిఫికేషన్ ప్రకారం మాలు మిల్లులు కనీసం 30శాతం ప్యాకింగ్ చేయాలన్న నిబంధనలను భారతదేశంలోని ప్రతి నూలు మిల్లు అమలు చేయాలి. ఆకలి చావులతో, ఆత్మహత్యలతో మరణించిన చేనేత కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. ప్రభుత్వాల, ప్రభుత్వ సంస్థల అవసరాలకు చేనేత వస్త్రాలనే కొనుగోలు చేసి వాడాలి. కుటుంబంలో అర్హులైన చేనేత కార్మికులందరికీ చేనేత పెన్షన్లు మంజూరు చేయాలి.
చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలి.

You cannot copy content of this page

Scroll to Top