టీటీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
** సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో తీర్మానం

తిరుపతి: టీటీడీ పరిధిలోని అన్ని కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర మహాసభల సందర్భంగా నూతన కమిటీలో బాధ్యతలు తీసుకున్న తిరుపతి జిల్లాకు చెందిన వారిని పరిచయం చేస్తూ తిరుపతి సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎస్.జయచంద్ర, టి.సుబ్రమణ్యం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ మాధవ కృష్ణ, గండికోట నాగ వెంకటేష్, గుణశేఖర్, కెపి బుజ్జి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర17వ మహాసభలు నంద్యాల పట్టణంలో 17, 18, 19 తేదీల్లో ఘనంగా నిర్వహించారు. అందులో మొదటి రోజు పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. అందులో సిఐటియు అఖిలభారత ప్రధాన కార్యదర్శి కరీంతో పాటు అఖిలభారత ఉపాధ్యక్షురాలు హేమలత, అఖిలభారత కోశాధికారి సాయిబాబా ప్రసంగించారు. అలాగే తిరుపతి జిల్లా నుంచి 35 మంది వివిధ రంగాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ మహాసభల్లో అనేక అంశాల గురించి చర్చలు జరిగాయి. భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ణయించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మహాసభల్లో
32 తీర్మానాలను ఆమోదించారు.
అందులో ప్రధానంగా..
1)టీటీడీలోని స్విమ్స్, శ్రీవారి మెట్లు కాంటాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని, టీటీడీ పర్మినెంట్ ఉద్యోగుల సమస్యలపై తీర్మానం.
2) లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని
3)విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ అమ్మకాలను ఆపాలని సొంత ఐరన్ గనులు కేటాయించాలని
4)స్కీమ్ వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని
5) కనీస వేతనాలు… చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని
6)కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ వివిధ క్యాడర్లో ఉన్న తాత్కాలిక సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని
7)విద్యుత్ కాంటాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులరైజేషన్ చేయాలని
8)పరిశ్రమల ప్రమాదాలు నివారించి భద్రతా ప్రమాణాలు మెరుగుకై చర్యలు తీసుకోవాలని 9)ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ విరమించాలని 10)అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని
11)మోటార్ వెహికల్ చట్టం సవరణ విరమించాలని… పెంచిన భారాలు, జరిమానాలు, శిక్షలు ఆపాలని
12)కార్మికులందరికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని
13)మహిళలు, బాలికలపై హింస అరికట్టాలని…. మద్యం మత్తు మందులను నియంత్రించాలని,14)శ్రామిక మహిళా హక్కులను కాపాడాలని నియంత్రించాలి.
15)ఎస్ఈజెడ్ లో కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ తీర్మానాలను చేశారు.
వీటికోసం పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు నిర్మించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.