సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం

TEJA NEWS

సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలి
సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నవీన్ తేజ


హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలంలో ఈనెల 24న జరగబోయే సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నవీన్ తేజ పిలుపునిచ్చినారు. కోదాడ పట్టణంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న మఠంపల్లి మండలం వి.ఆర్.ఎల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరగబోయే సమాచార హక్కు చట్టం 2005 రాష్ట్ర మహాసభలకు సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి ఆర్టిఐ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంస్థలో పనిచేస్తున్న పాతవారికి మరియు కొత్తవారికి సముచిత స్థానము గౌరవం ఇవ్వడంతో పాటు, నూతన కమిటీల ఏర్పాటు, ఐడి కార్డ్స్ మరియు అభివృద్ధి పనులు పారదర్శకత అవినీతిరహిత సమాజ నిర్మాణానికి సంస్థ నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ గెల్లా పవన్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం అంజి, కోదాడ మండల గౌరవ అధ్యక్షులు అమరబోయిన వీరబాబు, మునగాల మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top