బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం…
మృతులకు రూ. కోటి నష్ట పరిహారం కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఇప్పిస్తాం అని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు..
నీలం మధు ముదిరాజ్..
ఘటనా స్థలం సిగాచీ పరిశ్రమను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు..
ధ్రువ ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ..
చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం మంత్రులు..
సిగాచీ పరిశ్రమలో బాధితులైన ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజా నరసింహ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు లతో కలసి ఘటన స్థలాన్ని పరిశీలించారు.
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారాన్ని కంపెనీ యాజమాన్యం ద్వారా అందించడంతో పాటు క్షతగాత్రులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యను అందిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇందిరమ్మ పాలనను తలపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ కష్టాలలో తోడు నిలుస్తూ ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసి చైర్మన్, డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, చైర్మన్ ఎంఎ ఫహీం, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మెదక్ ఇంచార్జ్ ముజాహిద్, వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, పటాన్చెరు ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు ,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..
