విద్యారంగానికి పెద్దపీట వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…
ఇరిగేషన్, ఎడ్యుకేషన్ నాకు తొలి ప్రాధాన్యత సీఎం
ఐఐటీ పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం , రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు
ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గం లో చిట్ట బోయినపల్లి లో ఐఐటీ పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్రం మంత్రి , పార్లమెంట్ సభ్యులు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరయ్యారు.
ఐఐటీ పాఠశాల భవనానికి సీఎం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం జరిగినది.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది .
సీఎం మాట్లాడుతూ ….
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయినది. గతంలో పాలమూరు జిల్లా వలసల ప్రాంతంగా పిలువబడేది. ఇక్కడ సరైన విద్య లేక ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి ఉండేది. కాబట్టి పాలమూరులో విద్యార్థులు త్రిబుల్ ఐటీ చదవాలని ఈ ప్రాంతంలోని విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదివే పరిస్థితి లేకుండా ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఇక్కడే చదువుకోవాలని త్రిబుల్ ఐటీ భవనాలకు శంకుస్థాపన చేయడం జరిగింది సంవత్సరంలోపు పూర్తి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదల ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి 25 సంవత్సరాలు కష్టపడి నిబద్ధత చదువుకుంటే 75 సంవత్సరాలు జీవితాన్ని సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.
భవిష్యత్తులో విద్యారంగంలో పాలమూరు జిల్లాకు రాష్ట్రంలోని నెంబర్ వన్ స్థానంలో వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
