
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి…
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు…
పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, పిప్పిరి గ్రామానికి సోమవారం విచేస్తున్న సందర్బంగా ఆదివారం రోజున ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో… వారి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసి సభను విజయవంతం చేయాలని కోరిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ..
ముందుగా కంది శ్రీనివాస్ రెడ్డి వారి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు ని ఘనంగా సత్కరించారు…
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.