రాంగ్ రింగ్ రోడ్డు సెంటర్ వల్ల అనునిత్యం ప్రమాదాలకు నిదర్శనం

TEJA NEWS

రాంగ్ రింగ్ రోడ్డు సెంటర్ వల్ల అనునిత్యం ప్రమాదాలకు నిదర్శనం

భారీ లోడుతో వెళ్తున్న జీడి కర్రల ట్రాక్టర్ బోల్తా

అనునిత్యం ప్రమాదాలకు అడ్డగా మారిన రింగ్ సెంటర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట, భద్రాచలం రోడ్ లో జీడి కర్రతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు,ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదానికి ఓవర్ లోడ్ కారణమని సంఘటన స్థలం వద్ద ఉన్న వ్యక్తులు తెలిపారు.
నూతనంగా నిర్మించిన సెంట్రల్ డివైడర్ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని షాపు యజమానులు తెలిపారు. భారీ వాహనాలకు ఇవ్వాల్సిన చోట దారి ఇవ్వకుండా వేరే చోట ఇవ్వడం కూడా ప్రమాదానికి కారణం అని అన్నారు. ఈ ప్రమాదం వల్ల గంట వరకు వాహనాలు నిలిచాయి. అనునిత్యం ప్రమాదాలకు గల కారణం, రింగ్ రోడ్డు అని స్థానికులు చెప్తున్నారు. షాపుల యజమానులు సరైన రింగు సెంటర్ ను గుర్రాల చెరువు రోడ్డు మరియు పాపిడి గూడెం రోడ్డు మధ్యలో ఇచ్చుంటే ప్రమాదాలు జరగకుండా ఉండేవని సూచించారు. ఇప్పటికైనా అధికారులు రింగు సెంటర్ ని మార్చితే ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు.స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై పడిన లోడ్ ను ట్రాక్టర్ ను పక్కకు తీయించి వాహనదారులకు అంతరాయం ఏర్పడకుండా చేశారు.

You cannot copy content of this page

Scroll to Top