
ఈ ఉగాది కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలనిచ్చే శుభాది : ప్రత్తిపాటి
- ఉగాది ..కేవలం కొత్త సంవత్సరాది కాదు.. ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే శుభాది
- రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం శ్రేణులకు, కూటమి నాయకులకు పరాభవ నామ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు “ఈ ఉగాది శుభాలకు ఆదిగా నిలవాలని, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్తవిజయాల కలబోతగా మారి, ప్రతి తెలుగింటిలో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం శ్రేణులకు, మిత్రపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. నూతన తెలుగు సంవత్సరాది భానుడి తొలి కిరణాలతో పాటు మనందరి జీవితాల్లోకి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలు రావాలని, ఆ భగవంతుడి
ఆశీర్వాదం, మన సంకల్పం, పట్టుదలతో అవన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను. ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరాది ప్రారంభం మాత్రమే కాదు. మన ఆలోచనలు, మన హృదయాలు, మన జీవితాల్లో కొంగొత్త వెలుగులు
శుభ ఆరంభం. సరికొత్త సంకల్పాల ప్రారంభం. ఈ ఉగాది మన జీవితాలకు ఎప్పటీకీ గుర్తుండిపోయే మధురానుభూతులు ఇవ్వాలని, మంచి ఆలోచనలు, సత్కార్యాలకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కూటమి పార్టీల్లానే ప్రత్తి కుటుంబం సంతోషంగా కలిసి మెలిసి ఉండాలని, కుటుంబ బంధాలను మరింత బలపరచుకోవాలని, ప్రతి ఒక్కరి మనసులో ఆనందం, మనశ్శాంతి, ఆత్మతృప్తి నిండాలని అభిలషిస్తున్నాను. ఉగాది పచ్చడి”లో ఉన్న ఆరు రుచుల్లా, జీవితం కూడా సుఖదుఃఖాలతో నిండినదేననే సత్యాన్ని గ్రహించి, అన్నింటినీ సమానంగా స్వీకరించే ధైర్యం, సహనం ఈ పర్వదినం నుంచే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.“ అని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటనలో సూచించారు.