సత్తెనపల్లి నియోజకవర్గం
ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సిసిఐ )కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో రైతులకు కలగనున్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు మాజీ మంత్రి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
సత్తెనపల్లి పట్టణంలోని అమరావతి మేజర్ కాలువ వద్ద ఉన్న లక్ష్మీ కాటన్ ట్రేడ్ లో సీసీఐ కేంద్రాన్నిశాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించి మాట్లాడారు.
తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉంటేనే సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తారని 12 శాతం దాటితే రేటు తగ్గుతుందని అన్నారు
ప్లాస్టిక్ గోతాల్లో కాకుండా లూజుగా పత్తి సీసీఐ కేంద్రాలకు రైతులు తీసుకురావాలని కోరారు.
సీసీఐ కఠిన నిబంధనలను ముఖ్యమంత్రి తో సిసిఐ బాధ్యులతో మాట్లాడించి రైతులకు మేలు చేసేలా నిబంధనలు సడలించేందుకు కృషి చేస్తానని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని రైతులు సీసీఐ కేంద్రాల సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల వార్డు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
