నంద్యాల జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ ఢీకొని ముగ్గురు మృతి!

TEJA NEWS

నంద్యాల జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ ఢీకొని ముగ్గురు మృతి!

నంద్యాల జిల్లా: జనవరి22
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది సిరివెళ్ల మెట్ట దగ్గర నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు టైరు పేలి అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….

బస్సునంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట దగ్గర కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై గురు వారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంటైనర్ లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.. బస్సు టైర్ ఒక్కసారిగా పేలి పోవడంతో డివైడర్‌ను దా టి వెళ్లిపోయి.. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి.

ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్, దుర్మరణం చెందగా, కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్‌లు క్యాబిన్‌లో చిక్కుకుపోయి సజీవ దహనం అయ్యారు. వీరి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారిపోయాయి.లారీలోని ద్విచక్రవాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కొందరు క్షతగాత్రులకు నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటానికి స్థాని కులు, వాహనదారులు, బస్సు క్లీనర్ సహాయం చేశారు.ప్రమాద సమాచారం తెలియగానే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. శిరివెళ్ల మండల పరిధిలో జరిగిన ఈ ఘటన జిల్లాలో భయాందోళన కలిగించింది. పోలీసులు కంటైనర్ డ్రైవర్, క్లీనర్ వివరాలు సేకరిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top