మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కైవసం
చైర్మన్‌గా జాము రవి, వైస్ చైర్మన్‌గా కొల్తూర్ మోర్సుబాయి శశిరేఖ ఎన్నిక
మూడుచింతలపల్లి: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా జాము రవి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా కొల్తూర్ మోర్సుబాయి శశిరేఖ ఎన్నుకోబడ్డారు.
మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి , మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మా రెడ్డి , హాజరై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జాము రవి, కొల్తూర్ మోర్సుబాయి శశిరేఖలు తమ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి కి మరియు రాగిడి లక్ష్మా రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టేలా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నాయి.
