అధికంగా గెలలు రావడం వలన నేడు రేపు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సెలవు

TEJA NEWS

అధికంగా గెలలు రావడం వలన నేడు రేపు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సెలవు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం, దమ్మపేట మండలం అప్పారావుపేటలో గల రెండు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలకు వరుసుగా రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వారం రోజులు ఫ్యాక్టరీలకు ఆయిల్ ఫామ్ గెలలు అధికంగా వచ్చాయన్నారు. ఈ కారణంగా , రెండు రోజులు గెలలు కొనబోమని పేర్కొన్నారు. తిరిగి శుక్రవారం నుండి గెలలు యధావిధిగా కొంటామని రెండు మండలాల రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top