శివరాత్రి వేళ విషాదం..గోదావరిలో మునిగి ఐదుగురు యువకుల గల్లంతు

TEJA NEWS

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి జరిగింది. గోదావరి స్నానాలకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభ్యమయింది. శివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి గోదావరి నదిలో స్నానం చేయడానికి ఐదుగురు యువకులు దిగి గల్లంతయ్యారు.

పుణ్యస్నానాలకు దిగి…
తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం తారిపూడి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతయిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన ఐదుగురు ఎక్కడి వారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి.

You cannot copy content of this page

Scroll to Top