TEJA NEWS

పంట పొలాల్లోకి దిగి స్వయంగా వరి నాట్లు వేసిన జగిత్యాల ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి

జగిత్యాల జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి క్షేత్రస్థాయిలో చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిక్షణలో భాగంగా కొడిమ్యాల మండలం నాచుపల్లిని సందర్శించిన ఆమె, పంట పొలాల్లోకి దిగి స్వయంగా వరి నాట్లు వేశారు. రైతులతో కలిసి పని

చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత పదవిలో ఉండి కూడా సాధారణ మహిళలా బురదలోకి దిగి నాట్లు వేయడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు