కర్నె అరవింద్ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులుఘన నివాళి

TEJA NEWS

కర్నె అరవింద్ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
ఘన నివాళి

శంకర్‌పల్లి: బీఆర్ఎస్ నాయకుడు కర్నె అరవింద్ దశదిన కార్యక్రమం సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ఇబ్రహీంపట్నంలో స్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అరవింద్ వ్యక్తిత్వం, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ అరవింద్ యువ నాయకుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివ ప్రకాష్, సల్వాచారి, శరత్ రాజు, పోరండ్ల కౌశిక్, పవన్, నీళ్ళ లింగస్వామి పరామర్శించి అరవింద్ సేవలను కొనియాడారు.

You cannot copy content of this page

Scroll to Top