శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కు సన్మానం

TEJA NEWS

శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కు సన్మానం

తిరుపతి: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నియమితులైన కొట్టే సాయి ప్రసాద్ కు, సభ్యులు పగడాల మురళికి బిజెపి నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు సన్మానం చేశారు. తిరుపతికి విచ్చేసిన ఆయనను కలిసిన నాయకులు ఆయనకు కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీకాళహస్తి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు.. సామాన్య భక్తులకు మంచి దర్శనం కల్పించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, ఆముదాల ప్రభాకర్, జనసేన పార్టీ నాయకులు పోకల జనార్ధన్, తిరుత్తని వేణుగోపాల్, బిజెపి నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యంరెడ్డి, ఏవన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top